మన జీవన పరిష్కారా మార్గాలు మన ప్రకృతిలో ఉన్నాయి
- Native Diamond
- Jun 2, 2020
- 4 min read
Updated: Apr 19, 2022
మన బలమైన మిత్రుడిగా ప్రకృతితో సాయుధమయ్యే ఈ భవిష్యత్తులోకి మనం వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుద్ధరణకు మార్గం నిర్ణయించే పరిష్కారాలు మనకు అవసరం, మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మరియు ఆరోగ్యకరమైన సహజ వాతావరణాలపై ఆధారపడి ఉంటాయి అనే వాస్తవికతను మనం తెలుసుకోవాలి. మెరుగైన ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం సాంప్రదాయ జ్ఞానం మరియు జీవవైవిధ్యాన్ని కాపాడటం, పర్యావరణ, సామాజిక మరియు ఆర్థిక సవాళ్లకు సహజీవన పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం. జీవవైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ప్రజలకు మరియు భూమి మీద ఉన్న జీవరాసులకు సహజీవన పరిష్కారా మార్గాలను కనుగొనడం ఎంతైనా అవసరం ఉంది.
ఉదాహరణగా జీవవైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ప్రజలకు మరియు జీవ రాసులకు సహజీవన పరిష్కారా మార్గాలను ఒక్కసారి మనం గమనిస్తే! మలేషియా, సారావాక్ రాష్ట్రం, బోర్నియో ద్వీపంలోగల ఆదివాసీలు స్థానికంగా ఉత్పత్తి చేసే సబ్బు మరియు హ్యాండ్ వాష్ చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన నూనె కోసం స్థానిక మొక్క అయిన లిట్సియా క్యూబాను పండిస్తున్నారు. సారావాక్ రాష్ట్రం లోగల, సారావాక్ బయోడైవర్శిటీ సెంటర్, అక్కడ ఉండే ఆదివాసీల సాంప్రదాయిక జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ సబ్బు భాగస్వామ్యాల ద్వారా ఆదివాసీల యొక్క జీవనోపాధిని మెరుగుపరుసస్తూ - మరియు ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పొంపొందిస్తుంది.
ప్రపంచంలోని మెగా-బయోడైవర్శిటీ దేశాలలో మలేషియాలోని బోర్నియో హాట్‌స్పాట్ ఒకటి. బయో-డిస్కవరీల ద్వారా బయో-ఎకానమీ గ్లోబల్ పథంలో సారవాక్-బయోడైవర్శిటీ యొక్క ఉపయోగ అవకాశం చాలా ఉందని, సారావాక్ బయోడైవర్శిటీ కౌన్సిల్ చైర్మన్( 2018-2020), టాన్ శ్రీ దాతుక్ అమర్ విల్సన్ బయా దండోట్ అంటున్నారు. ఈ సారవాక్-బయోడైవర్శిటీ, వినూత్న ప్రాజెక్ట్ టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచింది, అక్కడ ఉండే సంఘాలు ఉపయోగించే మొక్కలను పరిరక్షించడం మరియు పునరుద్ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచింది. ఈ ప్రాజెక్ట్ ఆదివాసీ కమ్యూనిటీలకు, వారి సాంప్రదాయిక జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించి, మరియు వారిని దాని యొక్క నిజమైన యజమానిగా గుర్తించీ, అంతేకాకుండా కమ్యూనిటీ ఫలితాల ద్వారా వచ్చే లాభాల నుండి వారికి అధిక మొత్తంలో రాయల్టీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంది. ఈ సాంప్రదాయిక జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం నుండి పొందిన ఆవిష్కరణ శక్తి, జన్యు వనరులను మందులుగా, ఆరోగ్య సంరక్షణ మరియు మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే ఇతర ఉత్పత్తులుగా మార్చింది. ఇప్పుడు, ఏకంగా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముఖ్యమైన నూనె అధిక సంభావ్య పంటగా పరిగణించబడుతుంది అలాగే దాని నిరంతర సరఫరాను నిర్ధారించడానికి అక్కడ ప్రజలు స్థిరమైన పద్ధతిలో పండిస్తున్నారు.
మలేషియా ప్రభుత్వం, అక్కడ స్వదేశీ ప్రజలు మరియు స్థానిక ఆదివాసి ప్రజలు జన్యు వనరులను నిర్వహించీ, నేడు వనరుల ఆహారం, ఔషధం అందించడం మరియు జీవనోపాధిని కొనసాగించడంలో మూడు రెట్లు ప్రయోజనాలు పొందుతున్నారు. 1992లో ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్యం సమావేశం (సిబిడి) పై సంతకం చేయడంతో, మలేషియా ప్రభుత్వం ట్రిపుల్ లక్ష్యాన్ని సాధించడానికి సాంప్రదాయ జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేయడానికి మరియు రక్షించడానికి ప్రయత్నాలు చేశాయి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, సహజ వనరులను స్థిరంగా ఉపయోగించడం, మరియు జన్యు వనరుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను సరసంగా మరియు సమానంగా పంచుకోవడం. ప్రభుత్వం సమర్థతను నిర్ధారించడానికి ఒక సూచన. ప్రత్యేకించి, నాగోయా ప్రోటోకాల్ ద్వారా అంతర్జాతీయ సమాజం జన్యు వనరుల వినియోగం మరియు అనుబంధ సాంప్రదాయ జ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే ప్రయోజనాల యొక్క సరసమైన మరియు సమానమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది . జీవ వనరులకు ప్రాప్యతను మరియు వాటి వినియోగాన్ని కాపాడటానికి దేశాలు తమ స్వంత విధానం మరియు చట్టపరమైన చట్రాన్ని రూపొందించడానికి ఈ ప్రోటోకాల్ అనుమతిస్తుంది, దీనివల్ల వినియోగదారులు, ప్రొవైడర్లు, సంఘాలు లకు సమానమైన ప్రయోజనాలు లభిస్తాయి.
దేశం యొక్క జీవ వారసత్వాన్ని కాపాడటానికి, 2017లో మలేషియా బయోలాజికల్ రిసోర్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్ట్ 2017 (ఎబిఎస్) ను అమలు చేసింది. బయో పైరసీ , కొత్త చట్టం పేటెంట్లు జన్యు సమ్మేళనాలు మరియు జీవుల దాని మూలం యొక్క సరైన రసీదు నిర్ధారించడానికి, జీవ వనరుల బదిలీలు లేదా పరిశోధన ఫలితాల కోసం ఈ చట్టం అవసరాలను అమలు చేస్తుంది మరియు ముందస్తు సమాచార సమ్మతి (పిఐసి) నిబంధనను ఏర్పాటు చేస్తుంది. 2018 లో ఎబిఎస్ చట్టం మలేషియా నాగోయా ప్రోటోకాల్‌ను ఆమోదించడానికి మార్గం సుగమం చేసింది, దాని ప్రత్యేకమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో దేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది, అదే సమయంలో స్థిరమైన ఉపయోగం మరియు ప్రయోజనాల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. 2019లో మలేషియా యొక్క ధృవీకరణ అమల్లోకి వచ్చింది, దీనికి కొత్త జాతీయ నిబంధనలు మరియు సవరించిన ఉప-జాతీయ చట్టాలు మద్దతు ఇచ్చాయి . ఈ ప్రాజెక్ట్ మలేషియా యొక్క గొప్ప జీవవైవిధ్యం మరియు జీవ వనరుల యొక్క సామర్థ్యాన్ని దేశానికి మరియు స్థానిక ఆదివాసులతో సహా అందరికీ ముఖ్య వాటాదారులగా ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఔ షధాలు, న్యూట్రాస్యూటికల్స్ , వ్యవసాయ-రసాయనాలు వంటి కొత్త ఉత్పత్తుల యొక్క ఆవిష్కరణ మరియు అభివృద్ధి ద్వారా , ఈ ప్రాజెక్ట్ కొత్త వ్యాపారం, ఉపాధి, సాంకేతిక బదిలీ మరియు సామర్థ్యాన్ని పెంచే అవకాశాలకు తోడ్పడుతోంది. ఎబిఎస్ ప్రాజెక్ట్ నుండి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మన సాంప్రదాయ జ్ఞానం, జీవ వనరులను పరిరక్షించడానికి రాజకీయ సంకల్పం మరియు చట్టం ఉండాలని చెప్పటం జరిగింది.
అటవీ పరిశోధన సంస్థ మలేషియా (ఏఎఫ్. ఆర్. ఐ. ఎం) ఈ కొత్త అవకాశాలు జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థిరమైన ఉపయోగాల కోసం ఆర్థిక కేంటయింపులు జరిపారు. ఈ పని వలన మలేషియా ప్రముక్యతను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఉష్ణమండల అడవులు, చిత్తడి నేలలు మరియు పగడపు దిబ్బల రక్షణను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, సాంప్రదాయిక జ్ఞానాన్ని ఆవిష్కరించడం ద్వారా సారావాక్ జీవవైవిధ్య కేంద్రము పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడానికి, మలేషియా ప్రభుత్వం ఇంధన, సహజ వనరుల మంత్రిత్వ శాఖ, అటవీ పరిశోధనా సంస్థ మలేషియా (ఏఎఫ్. ఆర్. ఐ. ఎం) , జీవవైవిధ్య కేంద్రం అనేవి సారావాక్ జీవవైవిధ్య కేంద్రానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు ద్వారా పెనిన్సులర్ మలేషియాలోని ఆదివాసీ ప్రజలచే, సబా మరియు సారావాక్ రాష్ట్రాల్లోని ఔషధ మరియు సుగంధ మొక్కలపై సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి సహాయపడ్డారు . ఈ జీవ వనరులను ఉపయోగించడం కోసం, పరిశోధన మరియు అభివృద్ధికి ఆదివాసీ ప్రజలు మద్దతు ఇచ్చారు. ఈ పని ద్వారా సాంప్రదాయ జ్ఞానం యొక్క విలువపై అవగాహన పెంచింది మరియు ముందస్తు సమాచారం సమ్మతి అంటే ఏమిటో అర్థం చేసుకుంది. 2017 నాటికి, పెనిన్సులర్ మలేషియాలోని మొత్తం 18 రకాల ఉప జాతుల ఔషధ మరియు సుగంధ మొక్కలపై అటవీ పరిశోధనా సంస్థ మలేషియా (ఏఎఫ్.ఆర్. ఐ. ఎం) సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేసింది. అధే విదంగా, సబా మరియు సారావాక్ రాష్ట్రాల్లో స్థానిక ఉండే ఒరాంగ్ అస్లీ ఆదివాసీ ప్రజల వారి ఉపయోగాల ఆధారంగా మొత్తం 364 జాతుల ఔషధ మొక్కలను గుర్తించారు. ఆ మొత్తంలో, 86 జాతులు తదుపరి విశ్లేషణ కోసం ఎంపిక చేయబడ్డాయి, వీటిలో 33 జాతుల తుది సమితి ప్రోటోటైప్ ఉత్పత్తులుగా అభివృద్ధికి అవకాశం ఉందని భావించారు. ఈ ప్రాజెక్ట్ కింద నిర్వహించే ప్రతి కార్యాచరణకు, పాల్గొన్న అన్ని సంఘాల నుండి ముందస్తు సమాచారం సమ్మతిని (పి.ఐ.సి) పొందడం తప్పనిసరి. పి.ఐ.సి సమాజంలోని సభ్యులకు ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఇన్పుట్లను కలిగి ఉండటానికి, జీవ వనరులతో అనుబంధించబడిన వారి కమ్యూనిటీ యొక్క సాంప్రదాయ జ్ఞానాన్ని నిర్వహించడానికి మరియు ప్రాజెక్ట్ పరిణామాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా సామాజిక-ఆర్థిక పరంగా సమాజాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం మరియు జీవ వనరులకు ప్రాప్యత, ప్రయోజనాల భాగస్వామ్యంపై చర్చలు చేపట్టడానికి పిఐసి సమాజాన్ని అనుమతిస్తుంది.
ట్రెడిషనల్ మెడిసిన్ ప్రోటోటైపింగ్
అటవీ పరిశోధనా సంస్థ మలేషియా (ఏఎఫ్.ఆర్. ఐ. ఎం) విస్తృతమైన పరిశోధనలు నిర్వహించి ప్రోటోటైప్ అభివృద్ధికి, స్థానిక ఆదివాసీ కమ్యూనిటీల కోసం మరియు దేశం యొక్క జీవ వారసత్వాన్ని రక్షించడానికి ‘జీవ వనరులు మరియు ప్రయోజన భాగస్వామ్య చట్టం 2017’ (Access to Biological Resources and Benefit Sharing Act 2017 (ABS, ఏ.బి.యస్) to protect the country’s biological heritage) ఒప్పందాన్ని రూపొందించింది. ఒరాంగ్ అస్లీ ఆదివాసీ కమ్యూనిటీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు న్యాయమైన మరియు సమానమైన ప్రయోజన భాగస్వామ్య అంశాలు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించడానికి ఈ ఏ.బి.యస్ ఒప్పందం జాతీయ స్థాయిలో సూచనగా ఉపయోగపడింది . ఒరాంగ్ అస్లీ ఆదివాసీల ఎక్కువగా ఉండే కేడా (కేదా) మరియు పెరక్ (Perak) రాష్ట్రాలలో ఈ ఔషధ మొక్కల ప్రోటోటైప్‌ల ప్రారంభ వాణిజ్యీకరణ కోసం వారి స్తానిక సంఘాలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.
బయోడైవర్సిటీలో పురోగతి ఆవిష్కరణలతో జీవించడం
బయోడైవర్శిటీ - బయోటెక్ -ఆధారిత పరిశోధన ప్రారంభించడానికి మరియు జీవ వనరుల అభివృద్ధి కృషిలో ఆదివాసీల కమ్యూనిటీలను ద్వారా 2001 నుండి వేగంగా కనుమరుగవుతున్న సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు అనుసందనం చేయడంతో పాటు మద్దతు ఇవ్వడం ద్వారా సాదించికోవలసిన విజయాలు
దేశం లోగల ఆదివాసీ సమాజాలతో ముఖ్యమైన ఔషదాలు, మరియు జీవ వనరులు ఉత్పత్తికి సరఫరా గొలుసు అభివృద్ధి.
గ్రామాల షెడ్లు మరియు పరికరాలతో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ, పండ్ల తోటలు మరియు కూరగాయలు పండించే విధoగా ప్రోత్సహించటం.
జీవవైవిధ్య కేంద్రాల ద్వారా జీవ వనరులు విక్రయించే సంఘాలకు ఆదాయ ఉత్పత్తి చేయ్యడం.
జీవ వనరుల సంరక్షణ ఉత్పత్తి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నుండి సంఘాలకు రాయల్టీలు చెల్లింపు.
జీవ వనరు (ముడి పదార్థం) సేకరణ నుండి, ప్రాధమిక ముడి పదార్థం వెలికితీత ద్వారా, ద్వితీయ ఉత్పత్తి ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నుండి సంఘాలకు రాయల్టీలు చెల్లింపు.
బయోడివర్సిటీ ప్రయోజనాల భాగస్వామ్యం కోసం సమాచారాన్ని రికార్డ్ చేయడం నుండి ఉత్పత్తి అభివృద్ధి వరకు, సాంప్రదాయ జ్ఞానం ద్వారా గ్రహించిన ప్రయోజనాల యొక్క సరసమైన మరియు సమానమైన భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పే పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలలో కొత్త దిశను రూపొందించటం.
2011 నుండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (UNDP) , నేగాయ ప్రోటోకాల్ అమలు ఫండ్ (NPIF) మరియు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జిఇఎఫ్) , స్థానిక సంఘాలు మరియు జాతీయ అభివృద్ధి, ప్రైవేట్ రంగం, నిర్మాణ సామర్థ్య సహాయoతో దేశములో వ్యవసాయం, పంట రక్షణ, ఔషధ, వ్యక్తిగత సంరక్షణ, ఆహార , పానీయాల పరిశ్రమలకు, మరియు కొత్త వంగడాల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి జన్యు వనరుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోచ్చు.
మీ గేదెల రవి M.Sc, M.Tech (IITG), (PhD IITG)
అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్
నేషనల్ సోషల్ సర్విస్ ప్రోగ్రామం ఆఫీసర్
మన్యప్రగతి ఛైర్మన్.
Comments