గిరిజనుల మీ అటవీ భూమి మీ హక్కు
- Native Diamond
- Jul 22, 2021
- 3 min read
Updated: Apr 19, 2022
గిరిజన భూమికీ సంబందించిన న్యాయలు, చట్టాలు, రికార్డులు, కోర్ట్ తీర్పులు, భూ సమస్యలు, వాటి పరిస్కార మార్గాలు గూర్చి గిరిజన రైతులకు మరియు గిరిజన ప్రజలకు తెలియపర్చటం అందులో బాగంగా షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజన భూ సంరక్షణ చట్టం 1 ఒఫ్ 70 చట్టం గూర్చి. గిరిజన ప్రజలకు, తమ భూమి హక్కులు కాపాడటం కోసం సకల సమాచారని అందించటం మా భాద్యత.
గిరిజనులు అత్యాధికంగా ఉండే ప్రాంతాలను గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలు అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు ప్రాంతాలలో ప్రత్యక షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి . వాటి భూములకు ప్రత్యక భూ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలనే లాండ్ ట్రాన్స్ఫోర్ రెగులేషన్ ( ఎల్‌టిఆర్) చట్టం 1917, 1959, మరియు 1970. లాండ్ ట్రాన్స్ఫోర్ రెగ్యూలేషన్ చట్టం 1970 నే 1 ఒఫ్ 70 చట్టం అనీ కూడా అంటారు. గిరి పుత్రులకు 1 ఒఫ్ 70 చట్టం ఏమి చెపుతుంది మరియు ఏవిధంగా ఉపయోగపడుతుంది మనం తెలుసుకోవాలి.
షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఎవరైనా భూములు కొనవచ్చా , షెడ్యూల్డ్ ప్రాంతాలలో 1 ఒఫ్ 70 చట్టం అమలు , దాని విధానాలు, చట్టం ఉల్లంగన గూర్చి వివరంగా తెలుసుకుందాము. షెడ్యూల్డ్ ప్రాంతాలు అయిన తెలంగానలో ఖమ్మం, అదిలాబాదు, వరంగలు, మరియు రెండు మండలాల మహబూబానగర్., ఇక ఆంధ్రప్రదేశ్లో ఐడు జిల్లాలు శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్టనం, తూర్పు గోదావరి, మరియు పశ్చిమ గోదావరి. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యక మూడు చట్టాలున్నాయి అవి 1 ఒఫ్ 70 చట్టం, ఇది అందరి నోట్ల నానుతున్న చట్టం 1/70 యాక్ట్. షెడ్యూల్డ్ ప్రాంతాల భూ హక్కుల బదలాయింపు లాండ్ ట్రాన్స్ఫోర్ రెగులేషన్ ( ఎల్‌టిఆర్) చట్టం. ఆంధ్రప్రదేశ్ లో మొదట ఎల్‌టిఆర్ చట్టం 1917లో వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చిన తరువాతు 1959 లో ఎల్‌టిఆర్ చట్టం అమలోకి వచ్చింది, కానీ ముఖ్య అమెండమెంట్ 1970 లో మార్పులు చేస్తూ ఆ సంత్సరంలో మొదట రెగులేషన్ కాబట్టి 1 ఒఫ్ 70 యక్టు అంటారు . తెలంగాణలో 1963 నుంచి అమలోకి వచ్చింది మరియు ఇప్పటి కీ అదే చట్టం అమలో ఉంది . ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఒకేరకమైన ఎల్‌టిఆర్ చట్టం అమలో ఉంది .
ఈ ఎల్‌టిఆర్ చట్టం ఏమి చెపుతుంది అంటే గిరిజనులు అత్యాధికంగా ఉండే గిరిజన ప్రాంతాలు , ఏజెన్సీ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలు , ఈ మూడు పదాలు కూడా ఒకటే . ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉండే భూమి అంతా కూడా గిరిజనులదే, గిరిజనులుది కూడా కాబట్టి గిరిజనులకోసం ఈ భూమి కాపాడటం కోసమే ఈ ఎల్‌టిఆర్ చట్టం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసింది . ఇది అంతా కూడా అటవీ ప్రాంతం, కేవలం గిరిజన తెగలు మాత్రమే నివాసం ఉండే ప్రాంతం . అక్కడ అటవీ ఉత్పత్తిల పై ఆదారపడి బతుకుతూ కొద్దో గొప్ప పొడి భూముల వ్యవసాయం చేస్తూ , అక్కడే గిరిజనులు జీవించేవారు. ఆ తరువాతనే గిరిజనేతరలు వ్యాపారం కోసం, అటవీ సంపద కోసం, కలప కోసం, సాగుభూమి కోసం , మరియు స్తిరనివాసం కోసం షెడ్యూల్డ్ ప్రాంతాలలో రావడం మొదలు గిరిజన భూములు మీద, సంపద కోసం ఘర్షన్లు ప్రారంభం మొదలైయాయి . గిరిజన్లు అడవులను, భూములను కాపాడటం కోసం అనేక ఉద్యమాలు చేస్తూన్నారు మరియు చేశారు కూడా అవి గంపా రివుల్యూషన్, గోండు రివుల్యూషన్ మరియు కొమరం భీమ్ పోరాటాలు మొదలగునవి .
ఈ ఉద్యమాలు నేపద్యంలో వచ్చిన చట్టలే 1 ఒఫ్ 70 యక్టు. ఈ చట్టం ఏమి చెపుతుంది గిరిజన ప్రాంతాలలో భూములు కేవలం గిరిజనలకు మద్య మాత్రమే కొనుగోలు మరియు అమ్మకాలు జరిగాలి అని చెపుతుంది . అంటే , అదిలాబాదు నుంచి శ్రీకాకులం వరకు గిరిజన ప్రాంతాల స్టిరాస్తి అంటే భూమి గాని , ఇల్లు గాని మరియు ఇతర స్టిరాస్తిలు గిరిజనలకు , గిరిజన సొసైటి కీ మాత్రమే చెందుతాయి , ఎట్టి పరిస్తితులలో గిరిజనేతురులకు , అందుకు బిన్నంగా ఆస్తులు పొందినయెడల ఈ చట్టం వెసులుసుబాటు కల్పిస్తుంది . గిరిజన ప్రాంతలలో భూ అమ్మకాలు కొనుగోలు మద్య నాలుగు రకాల బదలాయింపు ఉన్నాయి, అవి
1. గిరిజనుల నుంచి ఇంకో గిరిజనులకు ఆస్తి/భూ బదలాయింపు
2. గిరిజనుల నుంచి ఇంకో గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు (సాద్యపడవచ్చు , ఎల్‌టిఆర్ 1917, 1959)
3. గిరిజనేతరుల నుంచి ఇంకో గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు (సాద్యపడవచ్చు, ఎల్‌టిఆర్ 1917, 1959)
4. గిరిజనేతరుల నుంచి ఇంకో గిరిజజలకు ఆస్తి/భూ బదలాయింపు.
కానీ , 1 ఒఫ్ 70 చట్టం ప్రకారం సుప్రీం కోర్ట్ సుదీర్గా తీర్పు 1996 లో తరువాత , గిరిజనుల నుంచి ఇంకో గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు సాద్యపడదు మరియు గిరిజనేతరుల నుంచి ఇంకో గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు (సాద్యపడదు) . ఈ రెండు విషయాలు కొట్టి వెయ్యడ్డాయి . అందుకు అంటే 1000 ఎకరాల భూమి లో 900 ఎకారాలు గిరిజలు వద్దా, 100 ఎకరాలు గిరిజనేతరుల వద్దా ఉన్నా , గిరిజనేతరుల జనాభా పెరిగి, ఆ 900 ఎకారాలు కూడా గిరిజనేతరులకు పొందుతారు ,మరలా గిరిజనులు నస్టపోతారు అని చెప్పి 2. గిరిజనుల నుంచి గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు (సాద్యపడదు) రద్దు చెయ్యబడ్డాయి , 3. గిరిజనేతరుల నుంచి గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు (సాద్యపడదు) రద్దు చెయ్యబడ్డాయి .
గిరిజనేతరులకు కాదు కూడదు అని ఆస్తి/భూ బదలాయింపు చట్టం ఉల్లంగిస్తే , గిరిజనులు కేసులు పెట్ట వచ్చు . కేసులు ఎవరు పెట్ట వచ్చు !! భూమి కొల్పైయిన గిరిజనుడు కానీ , ప్రజా హితం కోరి వేరొక గిరిజనుడు కానీ, మరియు గిరిజన సంఘాలు కానీ కేసులు పెట్ట వచ్చు.
కేసులు లేదా కంప్లయింట్ ఎవరికి పెట్ట వచ్చు ప్రతక చట్టం!! ఉంది అది అవరు అంటే ట్రైబల్ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ట్రైబల్ ఆఫీసర్, యామ్.ఆర్.ఓ లేదా ఆర్డీఓ . ఒక్కసారి ఎల్‌టిఆర్ చట్టం ఉల్లంగన జరిగింది అని నిర్ధారణ జరిగితే ఆ భూమి ని ప్రభుత్వం తీసుకునీ మరలా భూమి కోల్పోయిన ఆ గిరిజనుడుకు గాని, అతను లేని పక్షం లో కుమారులుకు గానీ లేదా భూములు లేని పేద గిరిజనులకు ఆ భూమినీ పంచి పెట్టవచ్చు . ఒకవేళ 1970 తరువాత గిరిజనేతరుల నుంచి ఇంకో గిరిజనేతరులకు ఆస్తి/భూ బదలాయింపు అమ్మకాలు కొనుగోలు జరిగితే కేసు పెట్టి ఉల్లంగన నిర్ధారణ జరిగితే అది కూడా చెల్లదు . అప్పుడు ప్రభుత్వమే ఆ భూమినీ తన అదీనంలోకి టీసుకుంటుంది. అలాగే క్రిమినల చర్యలు తీసుకోటానికి కూడా ఎల్‌టిఆర్ చట్టంలో ప్రొవిజను ఉంది .
ఇది అంతా కూడా అటవీ ప్రాంతం, కేవలం గిరిజన తెగలు మాత్రమే నివాసం ఉండే ప్రాంతం . అక్కడ అటవీ ఉత్పత్తిల పై ఆదారపడి బతుకుతూ కొద్దో గొప్ప పొడి భూముల వ్యవసాయం చేస్తూ , అక్కడ గిరిజనులు జీవిస్తారు వారి హక్కులు గుర్తిస్తూ వారికీ సామూహిక లేదా వ్యక్తి గత హక్కు పత్రం, 2006 లో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రం ఇస్తారు . ఇలాగ, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో సుమారుగా 2 లక్షలు పైగా గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ప్రభుత్వాలు ఇచ్చాయి . అటవీ హక్కు పత్రాలు రానీ వారు మరలా సబ్ డివిజన్ కీ అప్లై చేసుకోవచ్చు , అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ కమిటీ ద్వారా పరిశీలించి హక్కు పత్రాలు ఇస్తారు.
మీ గేదెల రవి M.Sc, M.Tech (IITG), (PhD IITG)
అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్
నేషనల్ సోషల్ సర్విస్ ప్రోగ్రామం ఆఫీసర్
మన్యప్రగతి ఛైర్మన్.

Comments