ప్రపంచ ఆదివాసి ప్రజల అంతర్జాతీయ దినోత్సవం మరియు మన్య రత్న అవార్డు
- Native Diamond
- Jun 26, 2020
- 2 min read
Updated: Apr 19, 2022
ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవాన్ని మొదటిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994 డిసెంబరులో ప్రకటించింది, ప్రతి సంవత్సరం, ఆదివాసీ ప్రజలే అంతర్జాతీయo గా జరుపుకుంటారు. 2004, నుంచి ఆదివాసీ ప్రజల సంస్కృతి, భాష, అలవాట్లను, సాంప్రదాయాలనూ గౌరవీస్తూ యునైటెడ్ నేషన్స్ (UN) ఐక్యరాజ్యసమితి ఈ సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తుంది .
యునైటెడ్ నేషన్స్ (UN) ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం, 2016 సంవత్సరంలో, సుమారు 2680 ఆదివాసీ భాషలు ప్రమాదంలో ఉన్నాయని మరియు అంతరించిపోయే అంచున ఉన్నాయని అనేకరకమైన సైంటిఫిక్ సర్వేలు, రిసెర్చ్ సర్వేలు తెలుపుతున్నాయి. అందువల్ల, ఆదివాసీ భాషల గురించి ప్రజలను ఒప్పించడానికి, మరియు అవగాహన కల్పించడానికి, 2019వ సంవత్సరంను ఆదివాసీ భాషల అంతర్జాతీయ సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ (UN) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవాన్ని కళాకారులు, వక్తలు, కవులు, ప్రదర్శకులు మరియు విస్తృత శ్రేణి విక్రేతలతో అన్ని దేశాల ఆదివాసీ ప్రజలే వేడుకగా జరుపుకుంటారు.
ఇక, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, 2014 నుంచి, ఆదివాసీ ప్రజల సంస్కృతి , భాష , అలవాట్లను, సాంప్రదాయాల గౌరవీస్తూ ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది ఆదివాసీ అదృష్టం, ఎందుకు అంటే పండగలు అనేవి ప్రజలు జరుపుకోవాలి. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, కళలు ఆచరించటం లేదు!! ఆంధ్రప్రదేశ్ లోగల గిరిజన పండగలు బోనాల పండగ, విత్తనాల పండగ, టెంకయా పండగ, అమ్మ వారి పండగ, గాటి వారాలు, ఉజ్జడి పండగ, మామిడికొత్త పండగ,కంది కొత్త పండగ …….ఇలా చాలా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోగల గిరిజన జాతాపు భాష, సవర భాష మాట్లాడేవారు రోజురోజుకు తగ్గుతున్నారు.
పైన తెలిపిన విషయాలు దృస్తీలో పెట్టుకుని, మన్యప్రగతి అనే ఎన్‌జిఓ నూ 2013లో స్టాపించడం జరిగింది. మన్యప్రగతి యొక్క ముక్య ఉద్దేశం (1) గిరిజన సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు మరియు భాషను కొనసాగించడం (2). మార్కెటింగ్ లేదా మూలధన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు గిరిజన అటవీ ఆధారిత ఉత్పత్తులను మెరుగుపరచడం (3) గిరిజన అభివృద్ధిపై సాంకేతికతను సమగ్రపరచడం.
మన్యప్రగతి! పైన తెలిపిన విషయాలు దృష్టీలో పెట్టుకుని 2014 నుంచి వాటికి సాధనకు అనుగుణoగా గిరిజన ప్రజలతో కలిసి పని చెయ్యటం జరుగుతుంది. ఈ భాగంగానే 2016 లో ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవ రోజున ఆదివాసుల ప్రజల సంస్కృతి , సంప్రదాయాల పై జిల్లా స్తాయి డ్రాయింగ్ పోటీలు నిర్వహించటం జరిగింది . అలాగే ఆదివాసి సమాజంలో నాయకత్వ అభివృద్ధిని ప్రోత్సహించడానికి మన్య ప్రగతి సంస్థ వార్షిక “మన్య రత్న” అవార్డు 2018 నుంచి ప్రకటించింది. ఇది ఆదివాసి సమాజానికి ముఖ్య పురస్కారం, ఆదివాసిల అభివృద్ధికి సహకరించిన వ్యక్తికి ఇవ్వబడింది. ఆదివాసి ప్రజల సాధించిన విజయాలు, ఆదివాసి సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేసి విద్య, కళలు, క్రీడలు, ప్రజా సేవ, సామాజిక సేవ మరియు గిరిజన ప్రాంతంలోని మరే ఇతర ముఖ్యమైన రంగాలలోనూ వారు చేసిన విశేష కృషి కారణంగా ఈ మన్య రత్న అవార్డును ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున బహుకరించటం జరుగుతుంది.
మీ గేదెల రవి M.Sc, M.Tech (IITG), (PhD IITG)
అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్
నేషనల్ సోషల్ సర్విస్ ప్రోగ్రామం ఆఫీసర్
మన్యప్రగతి ఛైర్మన్.
Comments