top of page

జీవో నెంబర్.3 రద్దుతో గిరివాసీ ఉద్యోగాలకు పెద్ద పెను ముప్పు!

Updated: Apr 19, 2022

షేడ్యూల్డ్ ప్రాంతాలకు రాజ్యాంగ పరoగా ప్రత్యేక రక్షణ ఉన్న, ఈ షేడ్యూల్డ్ ప్రాంతాలకు స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు ఆదివాసులకు హక్కులు కల్పించటం ద్వారా అడవులను, ఎన్విరాన్మెంట్, వన్య ప్రాణాలను, బయోడైవర్సిటీనీ రక్షించటమే కాకుండా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ తగ్గించటానికి పరి రక్షకులగా ఉంటారని చెప్పి భారతప్రభుత్వానికి ఆనాడు (1948-1950) బ్రిటిష్ వారు సలహాలు మరియు సూచనలు చెయ్యటం జరిగింది. ఈ కారణoగా 5వ మరియు 6వ షేడ్యూల్డ్ ప్రాంతాలను, 1956లో భారత రాజ్యాంగ నిపునులు డా. బి.ఆర్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగ చట్టంలో చేర్చటం జరిగింది.


ఆదివాసీ ప్రజలు జాతి మైనారిటీ పేదలుగా ఉన్నారు, వారు ప్రపంచ జనాభాలో 5% ఉన్నారు, కానీ ప్రపంచంలోని తీవ్ర పేదలలో 15% ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీయేతర ప్రజల ఆయుర్దాయం కంటే ఆదివాసీ ప్రజల ఆయుర్దాయం 20 సంవత్సరాల వరకు తక్కువగా ఉంటుంది. ఆదివాసీ ప్రజలు పర్యావరణాన్ని రక్షించడానికి, వాతావరణ మార్పులతో పోరాడటానికి మరియు ప్రకృతి వైపరీత్యాలకు స్థితిస్థాపకత కల్పించడంలో సహాయపడతారు, అయినప్పటికీ వారి హక్కులు ఎల్లప్పుడూ రక్షించబడవు. ప్రపంచంలోని జీవవైవిధ్యంను 80% ఆదివాసీ ప్రజలే రక్షిస్తున్నారు. ప్రపంచ ఉష్ణమండల అటవీ కార్బన్లో 20% పైగా ఆదివాసీ ప్రజల భూభాగాల్లో నిల్వ చేయబడ్డాయి. ఆదివాసులు, అటవీ ప్రాంతాలలోనే ఉంటూ చరిత్ర, ఆచారవ్యవహారాలను, సంస్కృతి-సంప్రదాయాలను, వారసత్వ పరిజ్జ్ఞానoను, జీవనశైలిలను తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే అడవులను, ఎన్విరాన్మెంట్ను, వన్య ప్రాణాలను, బయోడైవర్సిటీనీ రక్షించటమే కాకుండా క్లైమేట్ చేంజ్, ఔషదాలను (విదుర సమీపంలోని అడవి మధ్యలో ఒంటరిగా నివసిస్తున్న మూలికా మెడిసితో వ్యాధులను నయం చేస్తున్న 75 ఏళ్ల గిరిజన మహిళ శ్రీమతి లక్ష్మీకుట్టి గారికి 2018 లో భారత ప్రభుత్వం దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర గౌరవం పద్మ శ్రీ అవార్డ్ తో సత్కరించటం జరిగింది), గ్లోబల్ వార్మింగ్ తగ్గించటానికి పరిరక్షకులగా ఉంటూ వస్తున్నారు. అలాగే తరచూ వస్తున్నా అంటు వ్యాదుల ముప్పు,మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాదుల ద్వారా కొన్ని తెగలలో దాదాపుగా సగం మంది తుడిచి పెట్టుకుపోయారు. ఈ గిరిపుత్రుల వైద్య సేవల్ని ప్రభుత్వాలు గాలికోదిలేశాయి. ప్రభుత్వాలు అటవీ వనరులు పైన పెట్టిన దృస్టీ వారి త్రాగునీరు, విద్యా, వైద్యం, రోడ్డు, రవాణా, ఉద్యోగాలు మరియు టెలీకమ్యూనికేసాన్ వంటి సదుపాయాలు మీద దృస్టి పెడితే కొంతైనా అభివృద్ది పదం లోకి వస్తారు.

ఆదివాసీ ప్రజల పట్ల శ్రద్ధ వహించడానికి గల కారణాలు

1. ఆదివాసీ ప్రజలు అనే వారు భారత దేశపు జనాభాలో 5% మాత్రమే ఉన్నారు, కాని భారతదేశంలోని 15% మంది పేదలు ఆదివాసీ ప్రజలే ఉన్నారు.

2. ఆదివాసీ ప్రజలు ఉపాంతీకరణను ఎదుర్కొంటున్నారు, మరియు ప్రాథమిక సేవలకు సమాన ప్రవేశం లేదు. ఆదివాసీ ప్రజల ఆయుర్దాయం ఆదివాసీయేతర ప్రజల ఆయుర్దాయం కంటే 20 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుంది.

3. ఆదివాసీ ప్రజలు మన పర్యావరణాన్ని రక్షించడానికి, వాతావరణ మార్పులతో పోరాడటానికి మరియు ప్రకృతి వైపరీత్యాలకు స్థితిస్థాపకతను పెంపొందించడానికి సహాయపడతారు, అయినప్పటికీ వారి హక్కులు ఎల్లప్పుడూ రక్షించబడవు. భారతదేశంలోని జీవవైవిధ్యం 80% ఆదివాసీ ప్రజలుచే పరిరక్షించబడుతుంది. భారతదేశ ఉష్ణమండల అటవీ కార్బన్లో 20% పైగా ఆదివాసీ ప్రజల భూభాగాల్లో నిల్వ చేయబడుతున్నాయి.


రాజ్యాంగ పరoగా ప్రత్యేక రక్షణ ఉన్న 5వ షేడ్యూల్డ్ ప్రాంతాలు100శాతం లేదా 80శాతం గిరిజన జనాబా ఉన్న గ్రామాలు నేటికీ షేడ్యూల్డ్ ప్రాంతాలుగా పరిగణింపబడని 542 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. స్వాతంత్ర్యాo పొందిన తరువాత, 1956 నుంచి ఇప్పటి వరకు ఒక చట్టం - వంద ఆకాంక్షలతో ఆదివాసుల అభివృద్ది నామ మాత్రoగానే జరుగుతుంది. ఇక వారి జీవన విధానo అంతా కూడా అటవీ హక్కులు, అటవీ ఫలాలు, అటవీ సంపద పైన ఆధారపడుతుంటారు. ప్రభుత్వం డీ - పట్టా భూములు ఇచ్చినా వాటికి సేల్డీడ్ మరియు ప్రోపర్టీ హక్కులు గిరిజనులకు ఉండవు, డీ - పట్టా భూములు అధికారాలు అన్నికూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఒక వేళ డీ-పట్టా భూములకు పట్టాలు ఇచ్చినా ఆ భూములన్నీ వర్షా ఆధారితం, వ్యవసాయ బోరు వేదమా అంటే గిరిజన గ్రామాలకే రోడ్లు లేన్నపుడు వ్యవసాయ బోర్లూ, బోరు బావులు, పంపు సెట్లతో వ్యవసాయం ఎలా సాధ్యం. డీ - పట్టా భూములు పై ఇల్లు కట్టుకోవటానికి బ్యాంక్ లోన్ రాదు, బిజినెస్ లోన్ రాదు, వ్యవసాయ లోన్ రాదు. ఇక గిరిజన ప్రజలకు మిగిలేది ప్రభుత్వ పధకాలు, రేషన్ కోట తప్ప వేరేమీ ఆధారం ఉండదు! ఇక చెట్లు ద్వారా వచ్చే ఆక్సిజన్, అటవీ ఫలాలు, అటవీ సంపద పైన అదరపటమే తప్పా వేరే మార్గం లేదు!. రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 7 దశాబ్దాలు గడిచినా గిరిజనుల బ్రతుకుల్లో ఆశించిన అభివృద్ధి నేటికీ రాలేదు. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రధాన జీవన స్రవంతి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల అయినా విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, రహదారి, రవాణా, విద్యుత్, తాగునీరు, సామాజిక-ఆర్థిక, సామాజిక-సాంకేతిక, క్రీడలు, సాంస్కృతిక, కళలు, సైన్స్ & టెక్నాలజీ, మరియు టెలికమ్యూనికేషన్ సదుపాయాలతో పోల్చినప్పుడు గిరిజనులు నేటికీ దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు.


అప్పటి, సంయుక్త ఆంధ్రప్రదేశ్ (ఎపి) రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ .3 ఉత్తర్వులను అనుసరించి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో 100% ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక ఆదివాసీ ప్రజలకు అనుకూలంగా కేటాయించడం జరిగింది. రాజ్యాంగ పథకంలో, ఐదవ షెడ్యూల్ కింద షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలు స్థానిక ఆదివాసులకు ప్రత్యేక రక్షణ మండలాలు. అక్కడి చట్టాలు బాహ్య దోపిడీ, భూమి పరాయీకరణ నుండి వారిని కాపాడటానికి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి. అక్కడ అక్షరాస్యత రేటు మరియు విద్యా స్థాయిలు చాలా తక్కువగా ఉన్నందున, ఐక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరుకాని పరిస్థితిని తనిఖీ చేయగల మరియు ఉపాధ్యాయుడు మరియు వార్డుల మధ్య సమర్థవంతమైన సంభాషణను నిర్ధారించే ఒక చట్టాన్ని తీసుకురావాలని భావించింది. ఆదివాసీ స్వంత ప్రజలకు చెందిన వ్యక్తులు ఉపాధ్యాయులుగా వారి ముందు నిలబడటం వల్ల ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపించే విద్యను పొందడానికి స్థానికులను ప్రోత్సహించారు. గిరిజన ప్రాంతాలలో విద్యా సదుపాయాలు పెరగాలి, పాఠశాలలో చదువు మానివేసిన విద్యార్ధులు సంఖ్య క్రమేణగా తగ్గాలి అంటే ఆ ప్రాoతంలో విద్యా, ఉద్యోగాలు, వారి భాష సంస్కృతిని ప్రోత్సహించి అక్కడ ఉండేవారికి ఉపాద్యాయ మరియు ఇతర ఉద్యోగాలను కల్పిస్తే వారు అక్కడే ఉండి అభివృద్ది పథంలో వస్తారని, వారికి భాష సమస్యలు ఉండవని, కుటుంబాలు చదువుకు మంచి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా, గిరిజనుల బ్రతుకుల్లో ఉద్యోగ -ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం, స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ ద్వారా, స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నెంబర్ .3 ను 2000 సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది.


స్థానిక గిరిజనులకు, 100 శాతం రిజర్వేషన్ ద్వారా, స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నెంబర్ .3ను తేదీ 22.04.2020 న సుప్రిo కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు!! ఏకంగా 5వ షేడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలు వర్తించే జీవో నెంబర్.3ను రద్దు చెయ్యటం ద్వారా చదువుకున్న గిరిజన యువతి-యువకులకు రిజర్వేషన్ 100 శాతం నుంచి 6 శాతానికి వస్తుంది అనే నినాదం ఇవ్వటం జరిగింది. ఇది ఆదివాసులకు పెద్ద పెను ముప్పు. ముప్పై నాలుగు సంవత్సరాల కార్యనిర్వాహక ఉత్తర్వు జీవో నెంబర్ .3 చెల్లుబాటును కొట్టేవేసిన సుప్రీం కోర్టు తీర్పు, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క షెడ్యూల్ ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులలో స్థానిక ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్లకు హామీ ఇస్తుంది. జీవో నెంబర్ .3 చెల్లుబాటును కొట్టేవేసిన సుప్రీం కోర్టు తీర్పు, అక్కడి ఆదివాసీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధం. ఇది అణగారిన ప్రజలకు సామాజిక న్యాయం అనే ఆలోచనకు వ్యతిరేకంగా ఉంది మరియు వారిని ఉద్ధరించే రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన ప్రక్రియకు ఆటంకం. కాబట్టి ప్రత్యేక జోన్‌కు పరిమితం అయిన ప్రత్యేక ఉద్దేశ్యంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ఇతర ప్రాంతాలకు వర్తించే సామాజిక న్యాయం తో పోల్చి చూడకూడదు.


ఆదివాసీలు ఆచరణాత్మకంగా అనేక పౌర సౌకర్యాలను కోల్పోయారు మరియు అనేక శతాబ్దాల నుండి నాగరిక సమాజం నుండి వేరుచేయ్యబడ్డారు. విలక్షణమైన సంస్కృతి, భౌగోళిక ఒంటరితనం, తమ ప్రత్యేకమైన ఆవాసాలకు తమను తాము పరిమితం చేసుకోవటానికి మొగ్గు చూపడం ఆదివాసుల ముఖ్యమైన లక్షణాలు. భారతదేశంలో చాలా మంది ఆదివాసులు, వారికి వారి స్వంత భాషలు ఉన్నాయి, దీనిని గుర్తించిన పూర్వపు పాలకులు ఆదివాసులకు ప్రత్యేక హోదా కల్పిస్తూ 1839 లోనే ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. అప్పటి నుండి ఆదివాసీ ఆచారాలు మరియు సంస్కృతికి అనుగుణంగా ఎప్పటికప్పుడు గుర్తించబడిన ఆదివాసి పత్రాలకు వర్తించే చట్టాలు బలోపేతం చేయబడ్డాయి. గుర్తించబడిన ఆదివాసీ భూభాగాల్లోని భూమి యాజమాన్యానికి హక్కులు ఇవ్వడడ్డాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ యొక్క చారిత్రక దృక్పథాన్ని మరియు ముఖ్యంగా రాష్ట్రంలో ఆదివాసులు మరియు జాతీయ స్థాయిలో సాధారణంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం లో గౌరవనీయ సుప్రీం కోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పుకు సంబంధించి విఫలమైంది. ఆదివాసీలు , భారతదేశం స్వాతంత్ర్యం పొందిన ఏడు దశాబ్దాల తరువాత కూడా వారు అభివృద్ధి దోహద పడే రహదారి, రవాణా, విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, క్రీడలు, టెలికమ్యూనికేషన్, సంస్కృతి మరియు కళలు, సామాజిక-ఆర్థిక, సామాజిక-సాంకేతిక మరియు సైన్స్ & టెక్నాలజీ లకు వారు నాగరిక సమాజానికి దూరంగా ఉన్నారు.

ఇది ఈశాన్య ప్రాంతాలకు కాకుండా, ఇతర రాస్ట్రాల లోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే ఐదవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్ గిరిజన ప్రాంతాల పరిపాలనపై ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం మరియు పాలసీపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి గిరిజన ప్రతినిధులతో కూడిన గిరిజన సలహా మండలిని రూప కల్పించారు. ఐదవ షెడ్యూల్‌లో ఇది ఒక ప్రత్యేక నిబంధన. ఆదివాసీ ప్రాంతాలకు విస్తరించే ఏదైనా చట్టాన్ని ముందు గిరిజన ప్రతినిధులతో కూడిన గిరిజన సలహా మండలిచే సమీక్షించి, ఆదివాసీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న యెడల ప్రభుత్వo ఆ చట్టాన్ని ఆదివాసీ ప్రాంతాలకు విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇది భారత రాజ్యాంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూల్డ్ లో చేర్చబడింది.

ఉదాహరణకు, పంచాయతీలు (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 దేశంలోని మిగిలిన ప్రాంతాలలో అందుబాటులో లేని ప్రత్యేక అధికారాలను అమలు చేయడానికి ఆదివాసి గ్రామసభలకు అధికారంఇస్తుంది.

ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరియు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాలి మరియు అన్ని విధాలా వెనుకబడి గిరిజనులకు అభివృద్ధిలో సంపూర్ణ భాగస్వామ్యం కల్పించాలి. అలాగే ప్రభుత్వం డీ-పట్టా మరియు, ఫారెస్ట్ భూములను వారికి పట్టాలు అందే విధంగా చర్యలు తెసుకుకోవాలి. అలాగే డీ-పట్టా భూములకు, ఫారెస్ట్ భూములను బోరు బావులు, వ్యవసాయ బోర్లూ మరియు పంపు సెట్లతో వ్యవసాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి.

గిరిజన ప్రాంతాలలో పండే పంటలకు, అటవీ ఫలాలు,మరియు అటవీ సంపదలకు గ్రామ సచివాలయల మరియు గిరిజన కార్పొరేషన్ ద్వారా గిట్టుబాటు ధర కల్పించాలి. ఇక డీ-పట్టా భూములకు, ఫారెస్ట్ భూములను వారి 1956 స్థానికత ఆదారమoగా ఇల్లు కట్టుకోవటానికి బ్యాంక్ల ద్వారా గృహ లోన్, బిజినెస్ చేసుకోవటానికి బిజినెస్ లోన్, ల్యాండ్ లోన్ వచ్చే విధంగా ఫారెస్ట్ చట్టం, పంచాయతీ రాజు చట్టం లో మార్పులు తీసుకురావాలి. ఈలా చేయటం ద్వారా గిరిజన ప్రజలు ప్రభుత్వ పధకాలు మీద అదరపటం తగ్గి వారు స్వతఃగా పెరుగదలకు లేదా అభివృద్దికి దోహద పడుతుంది.


మీ గేదెల రవి M.Sc, M.Tech (IITG), (PhD IITG)

అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్

నేషనల్ సోషల్ సర్విస్ ప్రోగ్రామం ఆఫీసర్

మన్యప్రగతి ఛైర్మన్.

 
 
 

Comments


bottom of page